గడువులోపు సీఎంఆర్‌ అందించకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-08-03T06:15:59+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు సీఎంఆర్‌ బియ్యాన్ని అప్పగించని రైస్‌ మిల్లర్లపై చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత ఆదేశించారు.

గడువులోపు సీఎంఆర్‌ అందించకుంటే చర్యలు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లత

 అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

జగిత్యాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు సీఎంఆర్‌ బియ్యాన్ని అప్పగించని రైస్‌ మిల్లర్లపై చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని క లెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బాయిల్డ్‌, రా రైస్‌ మిల్లర్ల యజ మానులతో సీఎంఆర్‌ అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. యాసంగి 2020-2021, వానా కాలం 2021-2022 సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోపు అందించాలన్నారు. గ త యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో 12 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 12 వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను పక్షం రోజుల్లోపు ప్రభుత్వానికి అప్ప గించాల్సి ఉందన్నారు. అదేవిధంగా 2021-22 సీజన్‌కు గానూ సీఎంఆర్‌ ను అందించడంపై రైస్‌ మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులుగా బియ్యం అందించని మిల్లర్లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంకనూ 1.40 లక్షల మె ట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రైస్‌ మిల్లరు గడువులోగా చెల్లించాల్సి ఉందన్నా రు. పీడీఎస్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరా అధికారి చందన్‌ కుమార్‌, పౌరసర ఫరా శాఖ డీఎం రంజిత్‌ కుమార్‌, జిల్లా రా రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షు డు మైలారపు లింబాద్రి, ఫారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు, రారైస్‌ మిల్లర్లు, సివిల్‌ సప్లయి శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-03T06:15:59+05:30 IST