వాహనానికి నెంబరు ప్లేటు లేకుంటే చర్యలు: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-15T06:36:52+05:30 IST

వాహనానికి ముందూ, వెనుకా నెంబరు ప్లేటు లేకుంటే చర్యలు తప్పవని ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు.

వాహనానికి నెంబరు ప్లేటు లేకుంటే చర్యలు: ఎస్పీ
వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ వెంకట అప్పలనాయుడు , పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు.

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 14: వాహనానికి ముందూ, వెనుకా నెంబరు ప్లేటు లేకుంటే చర్యలు తప్పవని ఎస్పీ వెంకట అప్పలనాయుడు హెచ్చరించారు. నెంబరు ప్లేటు లేని వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇప్పటికే 103 వాహనాలను గుర్తించి, రికార్డులను పరిశీలించడానికి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఉంచగా, గురువారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెషల్‌ డ్రైవ్‌లో నెంబరు ప్లేటు లేని 103 ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను గుర్తించామని, రికార్డులను తనిఖీచేసి 42 వాహనాలకు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా వేశామని చెప్పారు. అప్పటికప్పుడు నెంబరు ప్లేటు తీసుకొచ్చిన వారికి వాహనాలను తిరిగి ఇచ్చేశామన్నారు. మరో 61 వాహనాల రికార్డులను పరశీలించాల్సి ఉందన్నారు. అలాగే నెంబరు ప్లేటు సరిగాలేని 866 త్రిచక్రవాహనాలకు రూ.86,600 జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. ఇకపై కూడా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఆరీఫుల్లా, ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జున, కాటమరాజు, ఎస్‌ఐలు తిమ్మయ్య, షేక్షావలి, బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T06:36:52+05:30 IST