కరోనాపై కట్టుదిట్టమైన చర్యలు

ABN , First Publish Date - 2020-04-09T11:00:55+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అనుమానితులను ప్రభుత్వ, హోం క్వారంటైన్లలో ఉంచి నిరంత రం పర్యవేక్షిస్తోంది

కరోనాపై కట్టుదిట్టమైన చర్యలు

సూర్యాపేట, ఏప్రిల్‌8 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అనుమానితులను ప్రభుత్వ, హోం క్వారంటైన్లలో ఉంచి నిరంత రం పర్యవేక్షిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల కు వెళ్లిన వారి నుంచే సూర్యాపేట జిల్లాలో వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు అధికారులు గుర్తించారు. అప్పటిదాకా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం 8కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు నమోదైన వారు ఎక్కడెక్కడ తిరిగారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోటలో 33మంది, నాగారంలో ఇద్దరు, మాచిరెడ్డిపల్లిలో 8మందిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. వీరి రక్త నమునాలను హైదరాబాద్‌కు పంపించగా ఫలితాలు రావాల్సి ఉంది.


జిల్లాలో 23మండలాలు, ఐదు ము నిసిపాలిటీలు ఉండగా కేవలం సూర్యాపేట, నాగారం మండలంలోనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యి. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వం క్వారంటైన్‌లో 116మ ంది, హోమ్‌ క్వారంటైన్‌లో 356మంది చికిత్స పొందుతున్నారు. హోమ్‌ క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించడంతో పాటు, జియో ట్యాగింగ్‌ చేశారు. దీంతో వారి కదలికలు స్పష్టంగా తెలుస్తాయి. అంతేకాక గ్రామంలో ఆశ కార్యకర్తలు సైతం రోజుకు రెండు సార్లు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిని తనిఖీ చేస్తున్నారు. 


రెండో దశలోనే కరోనా

జిల్లాలో నేటి వరకు కరోనా రెండో దశలోనే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇది మూడో దశకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేట మండ లం ఇమాంపేటలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహంలో 500బెడ్స్‌తో క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్‌ స్కూల్‌, సూర్యాపేట చందన నర్సింగ్‌ కళాశాలల్లో సైతం క్వారంటైన్స్‌ బెడ్స్‌ సిద్ధం చేశారు. ఎక్కడ అనుమానితులు ఉన్నా వెంటనే క్వారంటైన్‌ కేం ద్రానికి తరలిస్తున్నారు. 


అప్రమత్తంగా సిబ్బంది

జిల్లాఅంతటా వైద్య, పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు నివసించిన ప్రాంతాల్లో కిలో మీటర్‌ వరకు నిత్యం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని వెదజల్లుతున్నారు. అం తేగాక మురుగు కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం చేస్తున్నారు. 


ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి

ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. కిరాణం దుకాణాలు, పండ్లు అమ్మేవారు, కొనేవారు త ప్పనిసరిగా మాస్క్‌లు ధ రించి శానిటైజర్లతో చేతులను ఎప్పటికప్పుడు శు భ్రం చేసుకోవాలని సూ చిస్తున్నారు. మంత్రి గు ంటకండ్ల జగదీ్‌షరెడ్డి సైతం ఈనెల 7న స్వ యంగా పలువురికి మాస్క్‌ లు అందించారు. ప్రభుత్వం మార్చి 22నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించగా ప్రజలు సైతం సహకరిస్తున్నారు. ఇళ్లలోనే ఉండి కాలక్షేపం చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు ఉంటే చెస్‌, క్యారమ్‌ బోర్డులు ఆడడం వంటివి చేస్తున్నారు. చాలామంది ఇంట్లో కాలక్షేపం కోసం టీవీ చూడడంతో పాటు తోట పనులు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T11:00:55+05:30 IST