అనధికార లేఅవుట్లు వేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-06-15T05:00:00+05:30 IST

ప్రభుత్వ అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ హెచ్చరించారు.

అనధికార లేఅవుట్లు వేస్తే చర్యలు
ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్న నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌

 నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌

 మనుబోలు, జూన్‌ 14: ప్రభుత్వ అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ హెచ్చరించారు. మండలంలోని పోర్టు క్రాస్‌ రోడ్డు వద్ద ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికావడం, మధురానగర్‌ లేఅవుట్‌లో ప్రహరీగోడకు అందని నష్టపరిహారం ఫిర్యాదుపై సోమవారరం ఆర్డీవో పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. వ్యవసాయేతర భూమిగా అనుమతి ఉంటేనే లేఅవుట్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోర్టురోడ్డులో మూడు లైన్ల రహదారి భూసేకరణలో లేఅవుట్‌కు సంబంధించిన ప్రహరీగోడకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందలేదని లేఅవుట్‌ స్థల యజమాని ఫిర్యాదు చేయడంతో  పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామన్నారు. కార ్యక్రమంలో తహసీల్దార్‌ నాగరాజు, సర్వేయర్‌ రాము, విఆర్‌వో శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:00:00+05:30 IST