Abn logo
Apr 17 2021 @ 00:34AM

అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

అంతర్గాం, ఏప్రిల్‌ 16: అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి, విస్సంపేట, పొట్యాల గ్రామాల్లో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న అభివృద్ధి పనులు, స్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం అదపు కలెక్టర్‌ మాట్లాడుతూ స్మశాన వాటిక నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బూక్య యాదగిరి, సర్పంచ్‌, ఎదులాపురం, నీరజ, వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శులు గంగలక్ష్మి, రజిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement