ఆస్పత్రిని తనిఖీ చేసిన అదనపు డీఎంహెచఓ

ABN , First Publish Date - 2021-06-18T04:53:36+05:30 IST

ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని జిల్లా అదనపు డీఎం హెచఓ డాక్టర్‌ ఖాదర్‌వల్లి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆస్పత్రిని తనిఖీ చేసిన అదనపు డీఎంహెచఓ
రికార్డులను పరిశీలిస్తున్న ఖాదర్‌వల్లి

చాపాడు, జూన 17: ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని జిల్లా అదనపు డీఎం హెచఓ డాక్టర్‌ ఖాదర్‌వల్లి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుష్ఠు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలిం చారు. కరోనా టీకాలు,  కేసుల వివరాలను డాక్టర్‌ జ్యోత్స్నారెడ్డి ద్వారా తెలుసుకున్నారు. జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ గురప్ప పాల్గొన్నారు.

ప్రజలకు కుష్ఠుపై అవగాహన అవసరం

ఖాజీపేట, జూన 17: ప్రజలు కుష్ఠువ్యాధిపై అవగాహన కలిగి ఉన్న ప్పుడే వ్యాధి నయం అవుతుందని జిల్లా కుష్ఠువ్యాధి నివారణ అధికారి ఖాదర్‌వల్లి పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికం గా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ చర్మం పాలిపోయినా, లేక రాగివర్ణంలో పొడలు, మచ్చలు, స్పర్శ లేకున్నా, చెమట పట్టినా కుష్ఠువ్యాధి లక్షణాలుగా నిర్ధారించవచ్చన్నారు. ఈ వ్యాధిని బహుళ ఔషధ చికిత్స ద్వారా నివారించవచ్చన్నారు.

వ్యాధి గ్రస్తులను ఫిజియోథెరఫిస్టు గురప్ప, వైద్యాధికారి షెల్మియా సాల్మన పరీక్షించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణా ధికారి ఎం.రాఘవయ్య, ఆశా నోడల్‌ అధికారి షంషా ద్‌బేగం, సూపర్‌ వైజర్స్‌ యోగీశ్వరయ్య, విష్ణుప్రియ, ఫార్మసిస్టు సుభాషిణి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:53:36+05:30 IST