సమష్టి వ్యవసాయానికి యువరైతుల శ్రీకారం

ABN , First Publish Date - 2021-06-24T07:04:55+05:30 IST

జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలోని పలువురు యువరైతులు సమష్టి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు.

సమష్టి వ్యవసాయానికి యువరైతుల శ్రీకారం
గజసింగవరంలో భూమిని పరిశీలిస్తున్న యువరైతులు

- కేసీఆర్‌ పిలుపుతో ముందడగు

- ఆదర్శంగా నిలవనున్న గజసింగవరం  


గంభీరావుపేట, జూన్‌ 23 :జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలోని పలువురు యువరైతులు సమష్టి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. కుల మతాలకు అతీతంగా ‘అందరం ఒక్కటే’ అనే నినాదంతో గ్రామంలోని అన్ని కులాలకు చెందిన యువరైతులు నడుం బిగించారు. ‘కులం లేదు. మతం లేదు. ఊరంత ఒక్కటే. ఒక్కటే కులం. ఏ కులం అంటే అభివృద్ధి కులం.. బాగుపడే కులం.. బాగుచేసే కులం. బతుకులు మార్చే కులం అంద రినీ బ్రహ్మాండంగా తీర్చిదిద్దే కులం’ అని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న మాటలను ఆదర్శంగా తీసుకున్నారు. ‘అందరం కలిసి ఒకే చోట వ్యవసాయం చేద్దాం. గ్రామ అభివృద్ధికి తోడ్పడుదాం’  అనే నినాదంతో ముందడుగు వేశారు. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన యువరైతులు బుధవారం వ్యవసాయ భూములను పరిశీలించారు. చదును  చేయాలని నిర్ణయిం చారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్థీర్ణంలో వరి పం టను సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందిం చుకున్నారు. వీరిలో ముదిరాజ్‌, యాదవ, ఎస్సీ, రెడ్డి, విశ్వబ్రాహ్మణ, గంగపుత్రులు, ముస్లిం లతోపాటు ఇతర కులాలకు చెందిన యువ రైతులు ఉన్నారు.  

Updated Date - 2021-06-24T07:04:55+05:30 IST