కొఠియా అభివృద్ధికి గ్రామాల దత్తత

ABN , First Publish Date - 2021-02-24T05:36:21+05:30 IST

ఏపీ, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఒడిశా రాష్ట్రం వేగం పెంచింది. కొఠియా గ్రూపు గ్రామాల నుంచి గిరిజనులు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ఒడిశా నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.

కొఠియా అభివృద్ధికి గ్రామాల దత్తత

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 23: ఏపీ, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఒడిశా రాష్ట్రం వేగం పెంచింది. కొఠియా గ్రూపు గ్రామాల నుంచి గిరిజనులు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ఒడిశా నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈనేపథ్యంలో కొఠియా గ్రామాల్లో అభివృద్ధి జోరు పెంచేందుకు 21 గ్రామాలను వివిధ శాఖల అధికారులు దత్తత తీసుకోవాలని కొరాపుట్‌ జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఆక్తర్‌ సూ చించారు.  దత్తత గ్రామాల్లో ఆయా శాఖాధికారులు నెలకు రెండుసార్లు పర్యటించి అభివృద్ధిని సమీక్షిం చాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులు వచ్చే నెల 31 నాటికల్లా పూర్తి చేయించడానికి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. 

 


Updated Date - 2021-02-24T05:36:21+05:30 IST