షాకింగ్ ఘటన.. విమానంలోంచి కిందకు పడిన మానవ వ్యర్థాలు.. ఆ ఇంటి యజమాని చూస్తుండగానే..

ABN , First Publish Date - 2021-10-22T07:21:28+05:30 IST

జోక్ ఎప్పుడైనా నిజమైతే..? ఎగురుతున్న విమానం నుంచి ‘ఒకటి’కి బదులు.. ‘రెండు’ కింద పడితే.. కింద ఉన్న పరిస్థితేంటి..? ఇలాంటి పరిస్థితే ఇంగ్లండ్‌లోని..

షాకింగ్ ఘటన.. విమానంలోంచి కిందకు పడిన మానవ వ్యర్థాలు.. ఆ ఇంటి యజమాని చూస్తుండగానే..

‘ఆ విమానంలో నుంచి పొయ్యే వాళ్లు ఒకటికి పోతే.. అదెక్కడ మననెత్తిన పడుద్దంటావా..?’ ఈ డైలాగ్ ఎక్కడో సినిమాల్లో విన్నట్లుంది కదూ. ఇది వినగానే మనం నవ్వుకుంటాం. ఎందుకంటే ఇదో జోక్. కానీ ఈ జోక్ ఎప్పుడైనా నిజమైతే..? ఎగురుతున్న విమానం నుంచి ‘ఒకటి’కి బదులు.. ‘రెండు’ కింద పడితే.. కింద ఉన్న పరిస్థితేంటి..? ఇలాంటి పరిస్థితే ఇంగ్లండ్‌లోని ఓ వ్యక్తికొచ్చింది. పైనుంచి ఎగురుకుంటూ వెళుతున్న ఓ విమానం నుంచి మానవ వ్యర్థాలు.. కింద పడ్డాయి. అవి నేరుగా విండ్సోర్‌లో నివశిస్తున్న ఓ వ్యక్తి తోట నిండా పడ్డాయి. తోటలో నిలబడి ఉన్న ఆ వ్యక్తి కూడా మానవ మలంలో మునిగిపోయాడు. ఈ విషయం ఎప్పుడో జూలైలో జరిగింది. కానీ తాజాగా ఈ ఘటన గరించి స్థానిక కౌన్సెలర్ కరెన్ డేవిస్.. మెయిడెన్ హెడ్-విండ్సోర్‌లకు చెందిన విమానాయాన సంస్థ రాయల్ బరాగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం ఇప్పుడు బయటకొచ్చింది.


కౌన్సెలర్ డేవిస్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బాధితుడి తోటతో అతడు కూడా క్షణాల్లో మానవ వ్యర్థాలతో నిండిపోయారు. ఇలాంటి ఘటనల గురించి నేను తరచుగా వింటూనే ఉంటారు. చలి వల్ల విమానంలో టాయిలెట్స్ గడ్డకట్టి జామ్ కావడంతో ఇలా జరుగుతుంది. కానీ ఈ సారి గడ్డ కట్టలేదు. ఆ మలం మొత్తం నేరుగా అతడి తోటలో, అతడిపై పడింది. ఆ క్షణం ఆయన చాలా బాధపడ్డారు’ అని ఆమె పేర్కొన్నారు.


నిజానికి విమానాలు మానవ వ్యర్థాలను స్టోర్ చేసుకుంటాయి. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయినప్పుడు వాటిని అక్కడి సిబ్బంది తొలగిస్తారు. కానీ ఏదో వేడి వాతావారణం కావడం వల్లనే ఇలా జరిగుంటుందని జాన్ బోవెన్ అభిప్రాయపడ్డారు.


Updated Date - 2021-10-22T07:21:28+05:30 IST