నాగ్‌పుర్ నుంచి తాలిబన్‌‌లోకి.. తుపాకీతో ఫోటో వైరల్..?

ABN , First Publish Date - 2021-08-21T15:45:44+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అనేకమంది వరుసగా తాలిబన్లలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ భారత్‌‌లో నివశిస్తున్న ఆఫ్ఘన్ దేశస్థులు కూడా ఇప్పుడు..

నాగ్‌పుర్ నుంచి తాలిబన్‌‌లోకి.. తుపాకీతో ఫోటో వైరల్..?

ముంబై: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అనేకమంది వరుసగా తాలిబన్లలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ భారత్‌‌లో నివశిస్తున్న ఆఫ్ఘన్ దేశస్థులు కూడా ఇప్పుడు మాతృదేశం వెళ్లి తాలిబన్లలో చేరుతున్నారు. ఇటీవలే నాగ్‌పూర్ నుంచి కూడా ఓ ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు అక్కడకు వెళ్లి తాలిబన్లలో చేరినట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నాగ్‌పూర్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం అంటే జూన్‌లో నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్ర వెళ్లిన నూర్ 30ఏళ్ల మహమ్మద్ అలాయాజ్ అబ్దుల్ హక్ అనే వ్యక్తి తాజాగా తాలిబన్లలో చేరినట్లు సమాచారం అందిందన్నారు. తుపాకీ పట్టకుని ఉన్న అతడి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయని చెప్పారు.


ఇటీవల మీడియాతో మాట్లాడిన సదరు అధికారి.. ‘అబ్దుల్ హక్ భారత్‌లో 10ఏళ్ల నుంచి నాగ్‌పూర్‌లోని దిఘోరి ప్రాంతంలో అక్రమంగా నివశిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై పోలీసులు నిఘా పెట్టారు. అయితే జూన్ 23న అతడు దేశం విడిచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లిపోయాడు. తుపాకీతో ఉన్న అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి’ అని ఆ అధికారి పేర్కొన్నారు.


కాగా.. 2010లో కేవలం 6 నెలల టూరిస్ట్ వీసాతో భారత్‌లో అడుగుపెట్టిన అబ్దుల్ హక్.. ఆ తర్వాత తనను శరణార్థిగా గుర్తించాలని యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదించుకున్నాడు. అయితే అతడి నివేదన తిరస్కరణకు గురైంది. అయినా అప్పటి నుంచి అతడు భారత్‌లో అక్రమంగా నివశిస్తూనే ఉన్నాడు.

Updated Date - 2021-08-21T15:45:44+05:30 IST