‘అమ్మాయివి వెళ్లిపో..’ అక్కడి మీడియా చానల్‌ కొత్త రూల్

ABN , First Publish Date - 2021-08-20T08:47:19+05:30 IST

ఒకపక్క తాలిబన్లు.. తాము ఇస్లామిక్ లా ప్రకారం మహిళలకు గౌరవిస్తామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెబుతున్నా....

‘అమ్మాయివి వెళ్లిపో..’ అక్కడి మీడియా చానల్‌ కొత్త రూల్

కాబూల్: ఒకపక్క తాలిబన్లు.. తాము ఇస్లామిక్ లా ప్రకారం మహిళలకు గౌరవిస్తామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెబుతున్నా.. మరో పక్క అక్కడి పరిస్థితులు మాత్రం అలాలేవు. తాలిబన్ల భయంతో అక్కడి అనేక సంస్థలు మహిళా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీలో యాంకర్‌గా పనిచేస్తున్న మహిళా రిపోర్టర్ తన ఉద్యోగం కోల్పోయారు.


తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘన్‌లో అప్పుడే మహిళల అణచివేత మొదలైంది. ఇప్పటికే నిబంధనలు పాలించని కొంతమంది మహిళలను తాలిబన్లు చంపేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ యాంకర్‌ను ఆమె పనిచేసే టీవీ చానల్ ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఉదయం ఆఫీసుకు వచ్చిన ఆమెతో.. ‘నువ్వు.. అమ్మాయివి. ఇంటికి వెళ్లిపో..’ అంటూ పంపించివేసింది. ఈ విషయాన్ని సదరు యాంకర్ స్వయంగా వెల్లడించారు.


షబ్నమ్ దవ్‌రాన్.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ మహిళా యాంకర్. అక్కడి ఆర్‌టీఏ పష్తో అనే టీవీ చానల్‌లో యాంకర్‌గా ఆమె చాలా కాలంగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా దేశం తాలిబన్ల వశమైన తరువాత.. అక్కడి నిబంధనలన్నీ మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆమెను ఉద్యోగానికి రాకుండా చానల్ యాజమాన్యం అడ్డుకుని ఇంటికి పంపించివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-08-20T08:47:19+05:30 IST