husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..

ABN , First Publish Date - 2022-09-14T23:21:54+05:30 IST

భర్తే సర్వస్వంగా బతుకుంది భార్య. భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిస్తే తట్టుకోలేరు. అలాంటిది ఇక రెండో పెళ్లి చేసుకుంటానంటే కలలో..

husband love: భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా స్వాగతించిన భార్య.. చివరకు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయిన స్థానికులు..

భర్తే సర్వస్వంగా బతుకుంది భార్య.  భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిస్తే తట్టుకోలేరు. అలాంటిది ఇక రెండో పెళ్లి చేసుకుంటానంటే కలలో కూడా అంగీకరించరు. ఇలాంటి విషయాల్లో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే ఒడిశాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త పరాయి యువతితో తిరుగుతున్నాడని తెలిసినా భార్య పల్లెత్తు మాట అనలేదు. పైగా దగ్గరుండి మరీ వారిద్దరికీ వివాహం కూడా చేసింది. అయితే చివరకు గ్రామస్తులు ఆ యువతి గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఒడిశా (Odisha) కలహండి జిల్లా కలహండి పరిధి ధుర్కుటి అనే గ్రామానికి చెందిన ఫకీర్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకూ వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల భర్తకు దేపూర్ అనే గ్రామానికి చెందిన సంగీత అనే యువతితో పరిచయమైంది. భార్యకు తెలీకుండా ఆమెతో రోజూ కలుస్తుండేవాడు. అయితే ఇటీవల భర్త ప్రేమ విషయం భార్యకు తెలిసింది. తెలిసిన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన భార్య.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. అసలు ఏం జరిగిందంటూ భర్తతో వినయంగా చర్చించింది.

4 అంతస్థుల భవనం.. యజమానికి తెలియకుండానే ఏడాదిలోనే 20 సార్లు అమ్మేశారు.. ఇంత మోసం ఎలా జరిగిందంటే..


చివరకు వారి ప్రేమను అర్థం చేసుకున్న భార్య.. పెళ్లి చేసుకునేందుకు కూడా అంగీకరించింది. ఇటీవల దగ్గరుండి భర్తకు ఘనంగా వివాహం చేసింది. ఇదిలావుండగా సంగీత ఇటీవలే ఆపరేషన్ చేసుకుని.. మహిళగా మారిన ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకుని స్థానికులు అవాక్కయ్యారు. సంగీత మాట్లాడుతూ, తాను ట్రాన్స్‌జెండర్ అని తెలిసినా.. తమ ప్రేమను అర్థం చేసుకుని వివాహం చేసినందుకు ఫకీర్ భార్యకు కృతజ్ఞతలు తెలియజేసింది. మరోవైపు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన పలువురు హాజరై.. సంగీతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాత్రలు వాడుతున్నా ఎంతకూ తగ్గని జ్వరం.. ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆ తల్లి అడిగితే కొడుకు చేసిన దారుణమిదీ..!



Updated Date - 2022-09-14T23:21:54+05:30 IST