Advertisement
Advertisement
Abn logo
Advertisement

700ఏళ్లుగా ఈ ఊరిలో ఇంతే.. పెళ్లైన తర్వాత అమ్మాయిలు కాకుండా అబ్బాయిలే..

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి తర్వాత పెళ్లి వేడుకలు జోరందుకుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ గ్రామంలో సుమారు 700ఏళ్లుగా జరుగుతున్న వింత కార్యక్రమం తాజాగా బయటపడింది. పెళ్లైన తర్వాత అమ్మాయిలు కాకుండా అబ్బాయిలే ఓ ఆశ్చర్యకరమైన పని చేస్తుండటంతో ప్రస్తుతం అది చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని మౌంట్ అబూ నగరానికి సుమారు 10 కిలో మీటర్ల దూరంలో జవాయి అనే గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 700 ఏళ్లుగా ఓ వింత కార్యక్రమం జరుగుతోంది. అదేంటంటే.. సాధారణంగా పెళ్లి తర్వాత వధువు.. పుట్టింటిని వీడి, అత్తారింట్లో అడుగు పెడుతుంది. అయితే ఈ ఊరి అమ్మాయి మాత్రం.. అత్తారింటికి వెళ్లదు. ఆమెను వివాహం చేసుకున్న యువకుడే.. తన పుట్టింటిని వీడతాడు. అమ్మాయి గ్రామంలోనే అతడు స్థిరపడతాడు. ఎక్కడైనా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయే.. పుట్టింటిని వీడుతుంది కదా.. ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా అని స్థానికులను ప్రశ్నిస్తే.. సరైన సమాధానం చెప్పలేకపోయారు. అయితే.. 700ఏళ్ల క్రితం ఇద్దరు సోదరులు ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోగా అందులో ఒక వ్యక్తి మాత్రం ఇదే గ్రామంలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమ గ్రామంలో ఇదే సంప్రదాయం కొనసాగుతున్నట్లు వివరించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement