రష్యాపై అమెరికా, బ్రిటన్ కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2022-02-25T15:03:03+05:30 IST

ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై అమెరికా,

రష్యాపై అమెరికా, బ్రిటన్ కఠిన ఆంక్షలు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై అమెరికా, బ్రిటన్ కఠినమైన ఆంక్షలను విధించాయి. మునుపెన్నడూ లేనంతటి ఆర్థిక ఆంక్షలను బ్రిటన్ ప్రకటించింది. బ్రిటన్ ఫైనాన్స్ సిస్టమ్ నుంచి రష్యన్ బ్యాంకులను నిషేధించింది. రష్యన్ కంపెనీలు బ్రిటన్‌లో నిధులను సేకరించకుండా నిషేధం విధించింది. బ్రిటన్ బ్యాంకుల్లో రష్యన్లు డిపాజిట్ చేయడంపై పరిమితులు విధించింది. 


అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై కొత్తగా ఆర్థిక ఆంక్షలను విధించారు. దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులుగల నాలుగు ప్రధాన రష్యన్ బ్యాంకులపై కఠిన ఆంక్షలు విధించినట్లు బైడెన్ చెప్పారు. ఈ బ్యాంకులకు అమెరికాలో ఉన్న ఆస్తులను స్తంభింపజేసినట్లు తెలిపారు. రష్యాలోని రెండో అతి పెద్ద బ్యాంకు అయిన VTB కూడా ఆంక్షల పరిధిలోకి వస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఓ నియంత అని బైడెన్ ఆరోపించారు. గతంలోని సోవియెట్ యూనియన్‌ను పునరుద్ధరించాలని పుతిన్ కోరుకుంటున్నారన్నారు. మిగతా ప్రపంచం ఆకాంక్షిస్తున్నదానికి పుతిన్ ఆకాంక్షలు విరుద్ధమని చెప్పారు. 


Updated Date - 2022-02-25T15:03:03+05:30 IST