రెగ్యులర్‌ పోస్టుల భర్తీ తర్వాతే.. తాత్కాలిక జడ్జిలు సుప్రీంకు తెలిపిన కేంద్రం

ABN , First Publish Date - 2021-04-09T07:35:15+05:30 IST

హైకోర్టులలో రెగ్యులర్‌ జడ్జి పోస్టుల భర్తీ పూర్తయ్యాకే ఆర్టికల్‌ 224ఏ కింద తాత్కాలిక ప్రాతిపదికన అదనపు న్యాయమూర్తులను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది

రెగ్యులర్‌ పోస్టుల భర్తీ తర్వాతే.. తాత్కాలిక జడ్జిలు సుప్రీంకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: హైకోర్టులలో రెగ్యులర్‌ జడ్జి పోస్టుల భర్తీ పూర్తయ్యాకే ఆర్టికల్‌ 224ఏ కింద తాత్కాలిక ప్రాతిపదికన అదనపు న్యాయమూర్తులను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరఫున ఏఎస్జీ ఆర్‌ఎస్‌ సూరి ఈ విషయం నివేదించారు. పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకంపై గతంలో ధర్మాసనం కేంద్ర అభిప్రాయాన్ని కోరింది. దీనికి ఏఎస్జీ గురువారం సమాధానమిచ్చారు. 


Updated Date - 2021-04-09T07:35:15+05:30 IST