అసలు ప్రొటోకాల్‌ ఏంటి.. మేయర్ మేడమ్ మళ్లీ హాట్ టాపిక్!

ABN , First Publish Date - 2021-04-04T16:17:52+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి నగరంలో ఎక్కడ

అసలు ప్రొటోకాల్‌ ఏంటి.. మేయర్ మేడమ్ మళ్లీ హాట్ టాపిక్!

హైదరాబాద్/కేపీహెచ్‌బీ కాలనీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి నగరంలో ఎక్కడ పర్యటించినా స్థానిక కార్పొరేటర్‌, ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా..? లేదా..? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ డివిజన్‌ పరిధిలోని ఏడోఫేజ్‌ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌యూబీ పనులను శనివారం మధ్యాహ్నం మేయర్‌ పరిశీలించారు. మేయర్‌ వెంట జోనల్‌ కమిషనర్‌ వంకాయలపాటి మమత, మూసాపేట్‌ సర్కిల్‌ డీసీ రవికుమార్‌, ప్రాజెక్టు ఈఈ శ్రీకాంతి ఉన్నారు. ఆర్‌యూబీ ద్వారా ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంతో పాటు వర్షపు నీరు సంపులోకి వెళ్లేవిధంగా అధికారులు తీసుకున్న చర్యలను ఆమె అభినందించారు.


సోమవారం ఆర్‌యూబీ ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పారు. ఆమె ఇక్కడకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యేకు కానీ, డివిజన్‌ కార్పొరేటర్‌కు కానీ ఎటువంటి సమాచారం లేదు. ఆ ఇద్దరు కూడా అధికార పార్టీకి చెందిన వారే అయినప్పటికీ వారికి కనీసం సమాచారం ఇవ్వలేదంటే ప్రొటోకాల్‌ నిబంధనలు ఏంటి అనే చర్చ ప్రారంభమైంది. ఈ నెల 5న ఆర్‌యూబీని ప్రారంభించనున్నారు. 

Updated Date - 2021-04-04T16:17:52+05:30 IST