వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T05:28:07+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతు సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా గురువారం జిల్లా కేంద్రంలో ప్రజా, రైతు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో చేపట్టారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతు సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా గురువారం జిల్లా కేంద్రంలో ప్రజా, రైతు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో చేపట్టారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు బండి దత్తాత్రి మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు చట్టాలతో పాటు విద్యుత్‌ సంస్కరణ ఉప సంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్‌లకు అనుకూలంగా చట్టాలను తీసుకు వస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలను విరమించేలా ప్రభుత్వం చర్చలు జరిపి రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దర్శనాల మల్లేష్‌, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, కిరణ్‌,  కుంటాల రాములు, రాజేందర్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-12-04T05:28:07+05:30 IST