ఆర్‌బీకేలలో చేపలు, రొయ్యల మేతల అమ్మకం

ABN , First Publish Date - 2021-10-24T05:16:28+05:30 IST

ఆర్‌బీకేల ద్వారా రొయ్యలు, చేపల మేతలను తక్కువ ధరకే అందించేం దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ ని మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి రైతులకు సూచించారు.

ఆర్‌బీకేలలో చేపలు, రొయ్యల మేతల అమ్మకం
సమావేశంలో మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి

మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి



భీమవరం రూరల్‌, అక్టోబరు 23 : ఆర్‌బీకేల ద్వారా రొయ్యలు, చేపల మేతలను తక్కువ ధరకే అందించేం దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ ని మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి రైతులకు సూచించారు. భీమవరం ము నిసిపల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు.సమస్యలు ఉంటే రైతులు తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన రైతులు కింది స్ధాయి అధికారుల నుంచి కావా ల్సిన సహకారం అందడం లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆక్వా చెరువులు తవ్వేందుకు అనుమతుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొంత మంది అధికారుల నుంచి వివరాలు అడిగినా సరైన సమాధానం రావడం లేదని కొంత మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉండి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌, డీడీ చంద్రశేఖర్‌, ఆక్వా రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్‌, కొనుగోలుదారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:16:28+05:30 IST