నేటి నుంచి ఎయిర్‌పోర్టులో కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2021-05-05T16:48:47+05:30 IST

విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో..

నేటి నుంచి ఎయిర్‌పోర్టులో కఠిన ఆంక్షలు

ప్రయాణికులతో పాటు కారు డ్రైవర్‌కు మాత్రమే అనుమతి 

స్వాగత, వీడ్కోలుకు వచ్చేవారికి మెయిన్‌ గేటు వరకే !

ఇతర ప్రాంతాల ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు 

పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు 


గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుధవారం నుంచి కఠిన ఆంక్షల అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్‌ మాత్రమే రావాలి. స్వాగత వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను మెయిన్‌ గేటు వద్దే నిలిపేస్తారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇక రాష్ర్టానికి చేరుకునే ప్రతి ప్రయాణికుడికి తప్పనిసరిగా పరీక్షలు చేయనున్నారు. పాజిటివ్‌గా వస్తే క్వారంటైన్‌ తరలించేలా చర్యలు అధికార యంత్రాంగం చేపట్టనుంది. కలెక్టర్‌ ఇంతియాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆశా పర్యవేక్షణలో మెడికల్‌ టీమ్‌ పని చేయనుంది. 

Updated Date - 2021-05-05T16:48:47+05:30 IST