Abn logo
Jun 3 2021 @ 20:27PM

మమతా బెనర్జీ చెప్పినట్లే నడుచుకున్నా : మౌనం వీడిన ఆలాపన్

కోల్‌కతా : చాలా రోజుల తర్వాత బెంగాల్ మాజీ సీఎస్, సీఎం మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బందోపాధ్యాయ్ మౌనం వీడారు. కేంద్ర ప్రభుత్వం తనకు నోటీసులు పంపిన నేపథ్యంలో సమాధానమిచ్చారు. సీఎం మమతా బెనర్జీ ఏదైతే చెప్పారో, దానిని తూచ తప్పకుండా అమలు చేశానని, ఆమె చెప్పినట్లే నడుచుకున్నానని లేఖలో పేర్కొన్నారు.యాస్ తుపానుపై ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించిన రోజు తాను సీఎం మమతతోనే ఉన్నానని, ఆ సమయంలో ఉతర్త, దక్షిణ 24 పరగణాల పరిస్థితిని సమీక్షించే నిమిత్తమై ఏరియల్ సర్వేలో ఉన్నట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత సీఎం మమత ఆదేశాల మేరకు దిఘా వెళ్లినట్లు ఆలాపన్ లేఖలో తెలిపారు.