తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-11-28T05:53:33+05:30 IST

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయని, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ తెలి పారు.

తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండండి

దువ్వూరు, నవంబరు 27: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయని, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ తెలి పారు. శుక్రవారం దువ్వూరు పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ ప్రజలు తుఫానుపై అప్రమత్తంగా ఉండా లని, అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని సూచిం చారు. ప్రజలను రక్షించేందుకు 15 రిస్క్‌టీంలను అన్ని పోలీసు స్టేషన్‌ పరి ధిలో అందుబాటులో ఉంచామన్నారు. శుక్రవారం దువ్వూరు మం డలం గుడిపాడు నందు జాతీయ రహదారిపై నంద్యాల నుండి కడపకు నలుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టు పక్కకు వెళ్లడంతో దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా రక్షించారన్నారు. నీలాపురం తాండాకు వెళ్లే దారిలో ఉధృతంగా వాగు ప్రవహిస్తుండడంతో తాండావాసులకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. బద్వేలు మండలం చుట్టూ ఉన్న లక్ష్మిపాళెం, చెన్నంపల్లె, రాచాయపేట, నాగులకుంట చెరువులు పూర్తిగా నిండుకుని పారుతున్నాయని, పోలీసు, ఇరిగే షన్‌, రెవెన్యూ అధికారుల సమన్వయంతో చెరువులు తగిపోకుండా ఉండేందుకు సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్ర మంలో సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ కుళాయప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T05:53:33+05:30 IST