హౌస్‌ఫుల్‌

ABN , First Publish Date - 2021-05-18T06:46:28+05:30 IST

కొవిడ్‌ కేసుల్లో స్వల్ప తగ్గుముఖం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది నిజమైతే అదృష్టమే. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. అధికారికంగాను, అనధికారికంగాను పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఆసుపత్రులన్నీ హౌస్‌ఫుల్‌ అయిపోయాయి.

హౌస్‌ఫుల్‌
రాజమహేంద్రవరం ప్రభుతాసుపత్రిలో ఇదీ పరిస్థితి

  • బెడ్‌ ఖాళీ అయితేనే మరొకరికి
  • రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 50 మంది డిశ్చార్జి అయితే 120 అడ్మిషన్లు
  • ఇన్నీసుపేట కైలాసభూమిలో నిత్యం 50కి పైగా దహనాలు 
  • ొవ్వూరు శ్మశానవాటికకు క్యూ కడుతున్న మృతదేహాలు
  •  (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ కేసుల్లో స్వల్ప తగ్గుముఖం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది నిజమైతే అదృష్టమే. కానీ ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. అధికారికంగాను, అనధికారికంగాను పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఆసుపత్రులన్నీ హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 530 బెడ్లు ఉన్నాయి. అవన్నీ నిండుకున్నాయి. కొవిడ్‌ వైరస్‌ తగ్గడం వల్లనో లేక ప్రాణాలు పోవడం వల్లనో నిత్యం 50 వరక బెడ్లు ఖాళీ అవుతున్నాయి. ఇదే సమయంలో వీటి కోసం 120 నుంచి 130 మంది బాధితులు ఎదురు చూస్తున్నారు. అంటే ఒక బెడ్‌ ఖాళీ అయితేనే మరొకరికి దక్కే పరిస్థితి ఉంది. ఏదో బెడ్‌ ఏదో విధంగా ఖాళీ కావాలని కోరుకునే పరిస్థితి కూడా ఉండడం గమనార్హం. ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటిదాకా సుమారు 200మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గత 24 గంటల్లో అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో తొమ్మిది మంది మృతిచెందారు. కానీ ఆసుపత్రుల్లోను, ఇళ్ల వద్ద మృతి చెంది శ్మశానాలకు వచ్చే వారి సంఖ్య వందల్లో ఉంది. రాజమహేంద్రవరం ఇన్నీసుపేట కైలాసభూమిలో ప్రతీరోజూ 50కి పైగా పార్ధివ దేహాలను దహనం చేస్తున్నారు. కొన్ని బాడీలు కొవ్వూరు శ్మశానానికి క్యూ కడుతున్నాయి.  జిల్లాలో అవసరమైతే అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులతో పాటు ఇతర భవనాలు తీసుకుని బెడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ముందుగా టెస్టులు లేకపోవడం వల్ల కూడా రోగం ముదిరే వరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్యుల కృషి వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడుతున్నారడంలో సం దేహం లేదు. కానీ మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువ ఉండడం బాధాకరం. ఆక్సిజన్‌ సమస్య కూడా వెంటాడుతోంది.  బొమ్మూరు క్వారంటైన్‌లో సుమారు 500 మంది బాధితులు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రులూ బాధితులతో నిండిపోతున్నాయి. అధికారులు కొన్ని ఆసుపత్రులను తనిఖీ చేసినప్పటికీ సరైన సౌకర్యాలు లేక వాటిని కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించలేదు.

Updated Date - 2021-05-18T06:46:28+05:30 IST