అన్ని రంగాల్లో మహిళలు ముందంజ

ABN , First Publish Date - 2021-03-09T06:14:28+05:30 IST

నేటి సమాజంలో అన్ని రంగాల్లోను మహిళలు ముందున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందంజ
రాజమహేంద్రవరంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే భవాని

  • రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
  • ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • పలుచోట్ల అతివలకు సత్కారం

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 8: నేటి సమాజంలో అన్ని రంగాల్లోను మహిళలు ముందున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. జిల్లాలో పలుచోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వ హించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ తెలుగుమహిళా కమిటీ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే భవాని ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లా డారు. మహిళలు దేనికి భయపడాల్సిన పని లేదన్నారు. కేక్‌ కట్‌ చేసి మహి ళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మికి, మహిళా కమిటీ సభ్యులకు తిని పించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘ చైర్మన గుమ్మడి సమర్పణరావు, వ్యవస్థాపకుడు సానబోయిన రామా రావు, వైస్‌ చైర్మన ఎల్‌వీ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి పి.రామ్‌కుమార్‌, జిల్లా అధ్య క్షుడు జార్జిఅంటోని.. ప్రముఖ వైద్యురాలు, సంఘసేవకురాలు డాక్టర్‌ అనసూరి పద్మలత, నిరీక్షణ జేమ్స్‌, మంగ, సానబోయిన సుబ్బలక్ష్మిలను సత్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎర్రా రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ సతీమని ప్రభుత్వాసుపత్రి స్టాఫ్‌నర్సు కె.సరళాకుమా రిని సత్కరించారు. స్థానిక లాలాచెరువు హైస్కూల్‌, డీఎంహెచ పాఠశాలల్లో మహి ళా ఉపాధ్యాయులను, స్వీపర్లను డీఐ దిలీప్‌కుమార్‌ సత్కరించారు. స్థానిక ప్రధాన రైల్వేస్టేషన సమీపంలో ఎస్సీ రైల్వే మజ్ధూర్‌ యూనియన ఆధ్వర్యంలో మహిళా దినోత్సం నిర్వహించారు. రైల్వే మెడికల్‌ ఆఫీసర్‌ ఎం.వెం గమాంబ అధ్యక్షతన మహిళా ఉద్యోగులు డి.రజనీ, శాంతిస్వరూప, బి.కామేశ్వరి, ఫాతి మా, అన్నపూర్ణ, నాగలక్ష్మి, దివ్య, వెంకటలక్ష్మిలను సత్కరించారు. తాడితోట సంహిత డిగ్రి కళాశాలలో మహిళల లీడర్‌షిప్‌పై సదస్సు జరిగింది. వైసీపీ సీడబ్ల్యుసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా విచ్చేసి 31వ డివిజనలో మజ్జి నూకరత్నం ఆధ్వర్యంలో వైఎస్‌ విజయమ్మ చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక మావో భవనంలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో పి.టా న్యా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఏపీఎనజీవో ఆధ్వర్యంలోనూ వేడు కలు జరిగాయి. జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రతిభ ఎడ్యూకేర్‌ విద్యాసంస్థలో ఉపాధ్యాయు లకు, విద్యార్థినులకు మాస్టర్‌ నరేష్‌ కుంగుపూలో శిక్షణ ఇచ్చారు. ప్రతిభ డైరెక్టర్‌ ప్రతిభమూర్తి, డీన ఆస్లేషా, ప్రిన్సిపల్‌ నిర్మలా, సుశీల పాల్గొన్నారు. 

అర్బన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీ షిమొషిబాజ్‌పాయ్‌.. 11 లాండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్లు, దిశ స్టేషన్లలో ఉమెన హెల్ప్‌డెస్క్‌లను ప్రారంభించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సేవలందించిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం మహిళా పోలీసు అధికారులు ఎస్పీతో కలిసి మహిళా దినోత్సవం నిర్వహించారు.

Updated Date - 2021-03-09T06:14:28+05:30 IST