‘ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ వేయాలి’

ABN , First Publish Date - 2021-05-11T05:07:42+05:30 IST

ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్‌ సౌకర్యం కల్పించాలని జిల్లా కార్యదర్శి సత్యప్రకాశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

‘ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ వేయాలి’



బనగానపల్లె, మే 10:
  ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్‌ సౌకర్యం కల్పించాలని జిల్లా కార్యదర్శి  సత్యప్రకాశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పట్టణంలోని యూటీఎప్‌ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్‌ మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు 300కు పైగా ఉద్యోగులు కరోనాకు బలయ్యారన్నారు. అయినా విద్యాధికారులకు ఉపాధ్యాయుల సమస్యలు పట్టడం లేదన్నారు. నాడు నేడు ఫేజ్‌ 2, విద్యాకానుక, అమ్మవడి వంటి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, సర్వేల పేరుతో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ  ఉపాధ్యాయులను వేధిస్తున్నారన్నారు. కరోనా బారిన పడి మృతి చెందిన ఉద్యోగులకు 50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, హెల్త్‌ కార్డులతో వైద్యం అందించాలని కోరారు. ప్రవేటు ఆస్పత్రులు హెల్త్‌ కార్డులపై వైద్యంను నిరాకరిస్తున్నారన్నారు. ఫేజ్‌ 2 నాడునేడు పనులను వాయిదావేయాలని, పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.   కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, గౌరవాద్యక్షుడు సుధాకర్‌; విజయకుమార్‌, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:07:42+05:30 IST