Abn logo
Sep 11 2021 @ 14:22PM

హైదరాబాద్‌లోని ఆస్తుల కోసమే.. భయమంతా..: పల్లె రఘునాథరెడ్డి

అనంతపురం: జాతీయ జల విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే.. సీఎం జగన్‌మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌లోని ఆస్తుల పరిరక్షణ కోసమే జగన్.. ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సున్నితమైన నదీ జలాల పంపిణీపై జగన్‌మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా కంటే సాక్షి పేపర్ ప్రకటనల కోసమే.. రూ.300 కోట్లు ఖర్చుపెట్టాడన్నారు. హంద్రీనీవా పూర్తి చేయకపోతే.. సీఎం జగన్‌మోహన్ రెడ్డికి రాయలసీమ వాసులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.