యుద్ధోన్మాదిని ఏకాకిని చేయాలి!

ABN , First Publish Date - 2022-02-26T07:13:57+05:30 IST

ఉక్రెయిన్‌పై దాడికి దిగడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐరోపాలో తనకున్న ఇద్దరు మిత్రులను దూరం చేసుకున్నారు. యుద్ధవిమానాలు, ట్యాంకులతో..

యుద్ధోన్మాదిని ఏకాకిని చేయాలి!

పుతిన్‌పై మిత్రదేశాల ఆగ్రహం


ప్రేగ్‌, ఫిబ్రవరి 25: ఉక్రెయిన్‌పై దాడికి దిగడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐరోపాలో తనకున్న ఇద్దరు మిత్రులను దూరం చేసుకున్నారు. యుద్ధవిమానాలు, ట్యాంకులతో విరుచుకుపడుతున్న రష్యా దమనకాండను చూసి తూర్పు ఐరోపాలోని చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు మిలోస్‌ జెమన్‌, హంగరీ ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ తీవ్రంగా స్పందించారు. యుద్ధోన్మాదిని ఏకాకిని చేయాలని పిలుపిచ్చారు. రష్యా తీవ్ర నేరానికి పాల్పడిందని.. ఇది దురాక్రమణేనని ధ్వజమెత్తారు. 1979లో అఫ్ఘానిస్థాన్‌ దురాక్రమణ తర్వాత రష్యా పాల్పడిన అతిపెద్ద దుందుడుకు చర్య ఇదేనన్నారు. యూరప్‌ యూనియన్‌ (ఈయూ), నాటో దేశాలు దీనిని తీవ్రంగా ఖండించాలని పిలుపిచ్చారు. అంతరిం చిన సోవియట్‌ యూనియన్‌కు ఇవి ఒకప్పుడు మిత్రదేశాలు. 1956లో హంగరీ, 1968లో చెకోస్లోవేకియా కూడా ఇలాంటి దమనకాండను ఎదుర్కొన్నాయి. అప్పట్లో అవి కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేవి. ఆ తర్వాత ప్రజాస్వామ్య విధానం అవలంబించి.. రష్యాకు వ్యతిరేకంగా ఈయూ, నాటోలో చేరిపోయాయి. 

Updated Date - 2022-02-26T07:13:57+05:30 IST