బాదములతో ఆరోగ్యమైన పండుగ చేసుకోండి!

ABN , First Publish Date - 2022-01-12T19:17:01+05:30 IST

పండుగలు, వేడుకలు ఏవైనా దేశవ్యాప్తంగా ప్రజలందరూ మాత్రం వైవిధ్యమైన ఆహారం, సంప్రదాయ స్వీట్లతో విభిమైన రుచుల్లో మునిగిపోతుంటారు.

బాదములతో ఆరోగ్యమైన పండుగ చేసుకోండి!

పండుగలు, వేడుకలు ఏవైనా దేశవ్యాప్తంగా ప్రజలందరూ మాత్రం వైవిధ్యమైన ఆహారం, సంప్రదాయ స్వీట్లతో విభిమైన రుచుల్లో మునిగిపోతుంటారు. కానీ ఈ సందర్భంగా మనం తీసుకునే ఆహారపదార్థాలు కొంత అనారోగ్యం కలిగించవచ్చు. అలా జరుగకుండా ఉండాలంటే బాదం లాంటి నట్స్‌ను తీసుకోవాలని, వీటితో దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. అసలే కరోనా విజృంభిస్తున్న ఈ సీజన్‌లో అనారోగ్యకరమైన వేపుళ్లు, స్వీట్లును తినడం తగ్గించుకోవడంతో పాటుగా గుప్పెడు బాదాములను తినడం అలవాటుగా చేసుకోవాలని చెబుతున్నారు. బాదముల్లాంటి గింజలలో మెగ్నీషియం, రాగి, డైటరీ ఫైబర్‌తో పాటుగా రోగ నిరోధక శక్తి పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ ఈ కూడా ఉంటుంది. బాదములు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉండటంతో పాటుగా ఆకలి కూడా తీరుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.


బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘నా వరకూ మకర సంక్రాంతి లాంటి పండుగలంటే స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అత్యుత్తమ సమయంగా భావిస్తా. పండగల సమయంలో తీసుకునే ఆహారం విషయంలో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటా. అందుకోసమే జంక్‌ఫుడ్‌ను ఎప్పుడూ డైనింగ్ టేబుల్‌పైకి రానివ్వను. దానికి బదులుగా ఓ గిన్నెడు బాదములు పక్కన పెట్టుకుంటాను. రోజంతా నీళ్లు తాగుతూనే ఉంటాను. అంతేకాదు, పండుగ స్వీట్లను కూడా ఆరోగ్యవంతంగా మలుచుకునేందుకు, మరింత పోషకాలతో నింపేందుకు బాదములు, బెల్లం లాంటివి వాడుతుంటా’’ అని తెలిపారు.


సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఫిట్‌నెస్‌ నిపుణురాలు యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో పండుగ సమయంలో చిరుతిళ్లను అతిగా తినడం సర్వ సాధారణం. అయితే సంప్రదాయాలను పాటిస్తూనే మనం తినే ఆహారం, స్నాక్స్‌ ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. పండుగ స్నాక్స్‌ ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని నేను చెబుతుంటాను. ఈ రుచులకు తగిన పోషకాలను కూడా అందించడం అవసరం. ప్రాసెస్డ్‌, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు, స్వీట్లను తినడానికి బదులుగా గుప్పెడు బాదములు తినడం మంచిదని నా అభిప్రాయం. బాదమలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.’’ అని చెప్పారు.


న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ పండుగ సమయాల్లో ఎంతోమంది తమ ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను పక్కన పెడుతుంటారు. ఈ సమయంలో తినే ఆహారం కారణంగా బరువు పెరిగే సమస్య కూడా ఉత్పన్నమవుతుంటుంది. అందువల్ల బంధుమిత్రులతో ఉన్నప్పుడు ఏదైనా తినాలనుకుంటే, బాదములు లాంటి నట్స్‌ను దగ్గర ఉంచుకోండి. ఆకలిని దూరంగా ఉంచేందుకు బాదములు ఎంతగానో తోడ్పడుతాయి. బాదముల్లో రాగి, తగిన పరిమాణంలో జింక్‌ ఉంది. అవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి’’ అని తెలిపారు.

Updated Date - 2022-01-12T19:17:01+05:30 IST