రాష్ట్ర బంద్‌కు అమరావతి రైతుల మద్దతు

ABN , First Publish Date - 2021-03-05T16:21:49+05:30 IST

విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అక్క‌డి కార్మికులు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు అమ‌రావ‌తి రైతులు మ‌ద్ద‌తు తెలిపారు.

రాష్ట్ర బంద్‌కు అమరావతి రైతుల మద్దతు

అమ‌రావ‌తి: విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అక్క‌డి కార్మికులు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు అమ‌రావ‌తి రైతులు మ‌ద్ద‌తు తెలిపారు. బంద్ సంద‌ర్భంగా షాపుల‌ను అమరావ‌తి రైతులు స్వ‌చ్ఛందంగా మూసివేశారు. బంద్‌కు ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు అని చెపుతూ బ‌స్సులు తిప్పుతుండ‌డంపై  రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌న ద్వంద్వ ప్ర‌మాణాలు మానుకోవ‌లంటూ ఆగ్ర‌హించారు. రోడ్డు ర‌వాణా మంత్రి చెప్పినా బ‌స్సులు ఎలా రోడ్డు మీద‌కు వ‌చ్చాయంటూ నిర‌స‌న‌ తెలిపారు. క‌నీసం న‌ల్ల‌బ్యాజ్జీలు కూడా లేకుండా ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి మాటా ఆర్టీసీ సిబ్బంది విన‌డం లేదా అంటూ ప్ర‌శ్నించారు. స‌చివాల‌యం ఉద్యోగులు, హైకోర్టు ఉద్యోగుల కోస‌మే అధికారుల ఆదేశం మేర‌కే బ‌స్సులు తిప్పుతున్నామని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. విశాఖ ఉక్కుపై ప్ర‌భుత్వం ద్వంద్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా మంద‌డంలో అమ‌రావ‌తి రైతులు రోడ్డుపై  బైఠాయించారు. బ‌స్సులు వెనెక్కి వెళ్ళే వ‌ర‌కూ క‌దిలేదిలేదంటూ రైతులు, మహిళలు నిర‌స‌న కొన‌సాగిస్తున్నారు. 

Updated Date - 2021-03-05T16:21:49+05:30 IST