సాగుపై సందిగ్ధం

ABN , First Publish Date - 2022-02-06T05:20:47+05:30 IST

నేల తల్లిని నమ్ముకుని బతుకీడుస్తున్న అన్నదా తలకు కష్టకాలం మొదలైంది.

సాగుపై సందిగ్ధం
వరి పొలంలో పురుగు మందు పిచికారి చేస్తున్న రైతు

- సహకరించని ప్రభుత్వాలతో దిక్కుతోచని రైతులు


ఆత్మకూర్‌, ఫిబ్రవరి 5 : నేల తల్లిని నమ్ముకుని బతుకీడుస్తున్న అన్నదా తలకు కష్టకాలం మొదలైంది. ప్రతీ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండ డంతో సాగు భారమే అయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అత్యధిక మండలాల్లో రైతులు వరి పంటను అధికంగా సాగు చేస్తు న్నారు. గతేడాది ఖరీఫ్‌లో లక్షా 46వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. రబీ సీజన్‌లో ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని 35వేల ఎక రాల్లో సాగు చేసేవారు. ప్రస్తుతం వరిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని తేల్చి చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో అన్నదాతలు సాగుపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వరి తప్ప ఇతర పంటలు పండని పొలాల్లో ఏ ఏ పంటలు వేయాలో అర్ధం కాక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందని అన్న దాతలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 


 పెరుగుతున్న పెట్టుబడులు 

యాసంగి సాగుకు గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. గతంలో విత్తనాలకు ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ ఇచ్చేవి. రైతుబంధు అమలు చేసిన నాటి నుంచి వ్యవసాయ సబ్సిడీలు ఎత్తి వేయడం ఎరువులు, పురుగు మందుల ధరలు భారీ స్థాయిలో పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దీనికి తోడు మహిళా కూలీల ఖర్చు, డీజిల్‌ ధరలు పెరిగాయంటే పొలం చదును చేసే ట్రాక్టర్‌ వరికోత యంత్రందారులు ఎకరాకు రూ.500 అదనంగా పెంచారు. ఒక ఎకరా వరి పండించాలంటే రూ.25 వేల పెట్టుబడి అవుతోందని అన్నదాతలు తెలిపారు. ముఖ్యంగా ఎరువుల ధర లు 50కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.500 అదనంగా పెరిగిందని, దీనికి తోడు పురుగు మందులు లీటర్‌పై గతంలో ఉన్న ధర కంటే మరో వంద రూ పాయలు పెరగడంతో పండిన పంట పెట్టుబడులకే సరిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.  

 వ్యవసాయానికి సహాయం ఏదీ.? 

వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం.. రైతు సంక్షేమ ప్రభుత్వాలు మాదే అం టూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు చేసిందేమీ లేదని అంటున్నారు. ఎరువుల ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నా అరికట్టా ల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. ఎరువు బస్తా 50కిలోలకు రూ.400పైనే పెంచుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నా రు. ప్రభుత్వాలకు రైతులపై చిత్తశుద్ది ఉంటే వ్యవసాయ సబ్సిడీలు అమలు చేసి పండించిన ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ఎరువులు, పురుగు మందు ల ధరలు నియంత్రించాలని అన్నదాతలు కోరుతున్నారు. 


 చేసిన కష్టం కూడా మిగులుత లేదు..

   - వెంకటన్న, వరి రైతు, మూలమల్ల 

నాకు మూడెకరాల భూమి ఉంది. పదేళ్ల నుంచి వరి సాగు చేస్తున్న. వర్షాకాలంలో అధిక వానల వల్ల దిగు బడి రాలే. యాసంగిలోనైనా తీర్చుకుందామనుకుంటే ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపాయే. వడ్లు కొనమం టుండ్రు. మళ్లీ అప్పులు మిగిలేటట్లాయే. 




Updated Date - 2022-02-06T05:20:47+05:30 IST