Abn logo
Oct 12 2021 @ 21:33PM

అతడికి గత జన్మ గుర్తొచ్చిందట.. దానిపై శోధించడానికి Time కావాలట.. అందుకోసం ఏం చేశాడంటే..

గత జన్మలు ఉన్నాయో, లేవో తెలీదుగానీ.. ఈ టాపిక్‌తో చాలా సినిమాలే వచ్చాయి. ఇలాంటి సినిమాలన్నింటినీ చూసి స్ఫూర్తి పొందాడో.. ఏమో గానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి వింత కోరిక కోరాడు. తనకు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చాయని చెబుతున్నాడు. దీంతో ఈ అంశం.. తను పని చేస్తున్న కంపెనీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే కారణంతో తన బాస్‌కు ఈ విధంగా విన్నవించుకున్నాడు... పూర్తి వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మాల్వా జిల్లాకు చెందిన రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి.. సంశేర్‌ జనపద్‌ పంచాయతీ మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌లో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తనకు రాత్రిళ్లు.. గత జన్మ తాలూకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయట. పదే పదే గుర్తొచ్చి కలవరపెడుతున్నాయట. దీంతో ప్రతి ఆదివారం తనకు డే ఆఫ్ మంజూరు చేయాలని కోరుతూ లెటర్ రాశాడు.

అందుకోసం కారణాన్ని వివరిస్తూ.. తన జన్మ విషయాలను తెలుసుకోవడానికి.. భగవద్గీతను స్టడీ చేయాలని అనుకుంటున్నానని.. అందుకోసం సెలవు కావాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలవుల కోసం ఏం ఐడియా వాడావు నాయనా.. అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...