సిరిసిల్లలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-10-26T06:02:58+05:30 IST

కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు చౌరస్తా నుంచి సమీకృత కలెక్టరేట్‌ వరకు సోమవారం సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు.

సిరిసిల్లలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి
సిరిసిల్లలో బీడీ కార్మికుల ర్యాలీ

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 25 :  కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని రగుడు చౌరస్తా నుంచి సమీకృత కలెక్టరేట్‌  వరకు సోమవారం  సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ సిరిసిల్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ ఆస్పత్రిలో బీడీ కార్మికులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో కేటాయించిన స్థలంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించకపోవడంతో బీడీ కార్మికులు వైద్యం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులతోపాటు ప్యాకరులు, బట్టిచాట్‌ చట్టన్‌ల నుంచి ప్రతీ నెల ఈఎస్‌ఐ కోసం డబ్బులు కోత విధిస్తున్నారన్నారు.  మరోవైపు  బీడీ కార్మికుల కోసం సంక్షేమ పథకాలు రావడం లేదన్నారు. అనంతరం   కలెక్టర్‌ అనురాగ్‌జయంతికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముద్రకోల అంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి సదానందం, కే స్వామి, బాల్‌రెడ్డి, కృష్ణ, సిద్దిరాములు, హరి, రాజిరెడ్డి, కృష్ణమూర్తి, అనిల్‌, భూషణం, అనిల్‌, వెంకటేష్‌, బాలయ్య, మల్లేశం, నాగభూషణం, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, రాజు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T06:02:58+05:30 IST