Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇరువాడ వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మించాలి

అధికారులకు తహసీల్దార్‌ రమాదేవి ఆదేశం

సబ్బవరం, డిసెంబరు 3: అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇరువాడ వద్ద రైతుల విజ్ఞప్తి మేరకు అండర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలని అధికారులను తహసీల్దార్‌ రమాదేవి ఆదేశించారు. జాతీయ రహదారిపై రెండు రోజులుగా రైతులు నిరసన చేపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆమె అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు పొలాల నుంచి పంటలను తరలించేందుకు మరో మార్గం లేనందున, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధ్యయనం చేసి అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. ఆమె వెంట సర్పంచ్‌ బలిరెడ్డి లక్ష్మి, ఆర్‌ఐ రమణ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement