కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..

ABN , First Publish Date - 2022-02-19T22:03:22+05:30 IST

20 ఏళ్ల ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. ఓ రోజు దుస్తులు ఆరేద్దామని డాబా మీదకు వెళ్లింది. దుస్తులు ఆరేస్తుండగా.. ఊహించని రీతిలో ఆమె కళ్లముందు ఒక్కసారిగా షాకింగ్ సీన్ కనిపించింది . వివరాల్లోకి వెళితే..

కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..
ప్రతీకాత్మక చిత్రం

అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి.. అన్న చందంగా, ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే మరోటి జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనూహ్య ఘటనలు.. జీవితాన్నే తలక్రిందులు చేస్తుంటాయి. కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా ఓ యువతికి ఇలాంటి అనూహ్య అనుభవమే ఎదురైంది. 20 ఏళ్ల ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. ఓ రోజు దుస్తులు ఆరేద్దామని డాబా మీదకు వెళ్లింది. దుస్తులు ఆరేస్తుండగా.. ఊహించని రీతిలో ఆమె కళ్లముందు ఒక్కసారిగా షాకింగ్ సీన్ కనిపించింది . వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ మీరట్ పరిధి లిసాడిగేట్ ప్రాంతానికి చెందిన 20ఏళ్ల రేష్మ అనే యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో 50రోజుల్లో వివాహ కార్యక్రమం జరిపించేలా ఇరు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆ యువతి ఇంటి పనుల్లో ఉండగా.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దుస్తులు ఆరేసేందుకు వారి ఇంటి డాబాపైకి వెళ్లింది. తీరా దుస్తులు ఆరేసే క్రమంలో సడన్‌గా అక్కడ ఓ కోతి  ప్రత్యక్షమైంది. మరుక్షణమే యువతి పైకి దూకేసి, ముఖంపై రక్కేసింది. దాని బారి నుంచి బయటపడేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో కోతి మరింత బలంగా రక్కడంతో దవడపై లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆమె కేకలు విని కుటుంబ సభ్యులు, పక్కింటి వారు అక్కడికి చేరుకున్నారు.

నా భార్య తప్పు చేస్తోంది.. ఇలాంటామె నాకు వద్దు.. అంటూ పంచాయితీలో ఆ భర్త కామెంట్స్.. మరుక్షణమే షాకింగ్ సీన్..


కోతిని కర్రలతో అదిలించడంతో యువతిని వదిలేసి పారిపోయింది. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి చెంపపై సుమారు 12కుట్లు పడ్డట్లు వైద్యులు తెలిపారు. కోతి నుంచి తప్పించుకునే క్రమంలో పొరపాటున డాబా పైనుంచి కింద పడుంటే పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. ఇదిలావుండగా ముఖంపై తీవ్రగాయాలు కావడంతో వివాహ కార్యక్రమం సవ్యంగా సాగుతుందా, ఆగిపోతుందా అని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది.

‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’.. అంటూ లైవ్‌లోనే యాంకర్‌ను అడిగేసిన వ్యక్తి.. అవాక్కయిన ఆమె చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2022-02-19T22:03:22+05:30 IST