Advertisement
Advertisement
Abn logo
Advertisement

అ‘పూర్వ’ సమ్మేళనం


అనంతపురంరూరల్‌, నవంబరు28: మండలంలోని చియ్యేడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2002 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసభ్యులతో వచ్చి పాల్గొన్నారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుత తమ ఉద్యోగ అనుభవాలను పంచుకొని ముచ్చటించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులును ఘనంగా సన్మానించారు. అందరూ కలసి సహపంక్తి బోజనాలు చేశారు. పాఠశాలకు తమకు గుర్తుగా సిమెంట్‌ బల్లలు వితరణ చేశారు. 

Advertisement
Advertisement