అనంతలో కూలిన ఇంటి గోడ...బాలుడు మృతి

ABN , First Publish Date - 2020-10-21T16:57:31+05:30 IST

జిల్లాలోని ఉరవకొండ మండలం వై.రాంపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఇంటి గోడ కూలింది.

అనంతలో కూలిన ఇంటి గోడ...బాలుడు మృతి

అనంతపురం: జిల్లాలోని ఉరవకొండ మండలం వై.రాంపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఇంటి గోడ కూలింది. ఈ ప్రమాదంలో సుజన్(7) అక్కడికక్కడే మృతి చెందగా... మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-10-21T16:57:31+05:30 IST