Abn logo
Sep 29 2021 @ 08:15AM

కళ్యాణదుర్గంలో మితిమీరుతున్న అధికాపార్టీ నేతల ఆగడాలు

అనంతపురం:  జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఆగడాలు మితిమీరుతున్నాయి. బ్రహ్మసముద్రంలో అధికార పార్టీ నేతల వేధింపులతో చౌక ధాన్యపు డీలర్ నాగమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డీలర్ షిప్ వదులుకోవాలంటూ నాగమ్మపై  అధికార పార్టీ నేతలు , అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మనస్తాపం చెందిన నాగమ్మ పురుగులమందు సేవించి బలవన్మరణానికి యత్నించింది. నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మసముద్రం సర్పంచ్,  అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సి వచ్చిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption