మారనున్న ఆంధ్రాబ్యాంక్ లోగో..

ABN , First Publish Date - 2020-04-01T16:00:54+05:30 IST

రిజర్వు బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల..

మారనున్న ఆంధ్రాబ్యాంక్ లోగో..

నేడు ఆంధ్రాబ్యాంక్‌ విలీనం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రిజర్వు బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1 నుంచి ఆంధ్రా బ్యాంక్‌ లోగో మారబోతుంది. ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఏర్పడిన ఆంధ్రాబ్యాంక్‌ ఇక తెరమరుగు అవుతుంది. బ్యాంక్‌ల విలీనంలో భాగంగా కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌లను యూనియన్‌ బ్యాంక్‌లో కలిపారు. యూనియన్‌ బ్యాంక్‌తో పాటు ఆంధ్రా, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల లోగోలతో కలిపి కొత్త లోగోను రూపొందించారు.


జిల్లాలో ఆంధ్రా బ్యాంక్‌ శాఖలు 112, యూనియన్‌ బ్యాంక్‌ శాఖలు 20, కార్పొరేషన్‌ శాఖలు 20 ఉన్నాయి. ఈ మూడు బ్యాంక్‌లు కలిపి మొత్తం 152 శాఖలు ఇక నుంచి యూనియన్‌ బ్యాంక్‌ పరిధిలో కొనసాగుతాయి. జీటీ రోడ్డులోని ఐటీసీ కార్యాలయం సమీపంలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయం, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ కార్యాలయాలు యధావిధిగా అదే భవనంలో కొనసాగుతాయి. జిల్లాలో 2020 - 21 రుణ వార్షిక ప్రణాళికను యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో త్వరలో విడుదల చేస్తారు.  


Updated Date - 2020-04-01T16:00:54+05:30 IST