అంగన్వాడీ... పక్కనే మురికి

ABN , First Publish Date - 2021-10-22T04:58:58+05:30 IST

బుడిబుడి నడకలతో చిన్నారులు పడుతూ లేస్తూ వెళుతున్న అంగన్వాడీ కేంద్రం పక్కనే మురికినీటి గుంత ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మురికికుంటలో దోమలు చేరి పిల్లలు ఎక్కడ అనా రోగ్యం బారిన పడతారో అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అంగన్వాడీ... పక్కనే మురికి
అంగన్వాడీ కేంద్రం చుట్టూ ఉన్న మురికి కుంటలు

పట్టించుకోని అధికారులు

బుడిబుడి నడకలతో చిన్నారులు పడుతూ లేస్తూ వెళుతున్న అంగన్వాడీ కేంద్రం పక్కనే మురికినీటి గుంత ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మురికికుంటలో దోమలు చేరి పిల్లలు ఎక్కడ అనా రోగ్యం బారిన పడతారో అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకెళితే...

వేముల, అక్టోబరు 21: స్థానిక యాదవ బజారు బచ్చ య్యగారిపల్లె రోడ్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్‌ పక్కనే మురికికుంట ఉంది. ఎన్నో రోజుల నుంచి ఉన్నా దానిని పూడ్చివేయాలనే ఆలోచన ఒక్క అధికారికీ రాకపోవడం శోచనీయమని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తు తం వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా మురికినీరు దర్శనమిస్తోంది. సీజనల్‌ వ్యాధులు విజృంభించే సమయం ప్రారంభం కాగా గ్రామాల నీటితొట్లలో నీరు ఎక్కువకాలం నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య బృందా లు ఇంటింటికీ తిరిగి హెచ్చరిస్తున్నాయి. వారికి సైతం ఈ మురికి కుంట కన్పించనట్టుంది.

అంగన్వాడీ సిబ్బంది గానీ, పంచాయతీ సిబ్బంది గానీ మురికికుంటలపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. అంగన్వాడీ సెంటర్‌ సమీపంలో తాగునీటి పైప్‌లైన్‌ పగిలినీరంతా వృథాగా అం గన్వాడీ సెంటర్‌ మెయిన్‌ గేటు మీదుగా పారుతూ రోడ్డం తా పాచిపట్టి సెంటర్‌లోకి చిన్నపిల్లలు వెళ్లలేని పరిస్థితి. నడక నేర్చుకుంటున్న పిల్లలు పాచిపట్టిన రోడ్డు దాటుతూ జారిపడితే అంతే సంగతులు. పిల్లలు ఆడుకుంటూ బయ టకు వచ్చి పొరబాటున మురికికుంటల వైపు వెళ్తే ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదని త ల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ నీరంతా సెంటర్‌ పక్కనే ఉన్న మురికి కుంటల్లోకి చేరుతుండగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.  పిల్లలు అనారోగ్యం బారిన పడకముందే అధికారులు స్పందించి మురికికుంట లను పూడ్చివేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-22T04:58:58+05:30 IST