అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2021-10-10T05:23:06+05:30 IST

అంగన్‌వాడి కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు.

అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు

- అవస్థల్లో టీచర్లు....చిన్నారులు

- జిల్లాలో 591 అంగన్‌ వాడీలకు సొంత భవనాలు కరువు

జగిత్యాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడి కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. అద్దె భవనాల్లో కేంద్రాలు నిర్వహించాల్సి వస్తుండడంతో టీచర్లకు తిప్పలు తప్ప డం లేదు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల నిర్వహణ ప్రహసనంగా మారుతోంది. జిల్లాలో 241 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

జిల్లాలో 4 ప్రాజెక్టులు...1,065 కేంద్రాలు...

జిల్లా పరిధిలో 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ధర్మపురి, జ గిత్యాల, మల్యాల, మెట్‌పల్లి కేంద్రాలుగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ధర్మపురి ప్రాజెక్టు పరిధిలో 222, జగిత్యాల పరిధిలో 304, మల్యాల పరిధిలో 227, మెట్‌పల్లి పరిధిలో 312 ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. జిల్లాలో గల 1,065 కేంద్రాలలో మెయిన్‌ అంగన్‌ వాడీ కేం ద్రాలు 1,037, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు 28 ఉన్నాయి. ధర్మపురిలో 18, జగిత్యాలలో 10 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలున్నాయి. జిల్లాలోని అం గన్‌ వాడీ కేంద్రాల పరిధిలో 75,457 మంది గర్బిణులు, బాలింతలు, చి న్నారులున్నారు. ఇందులో 9,456 మంది గర్భిణులు, 6,763 మంది బా లింతలు, 7,605 మంది 7 నెలల నుంచి సంవత్సరం చిన్నారులు, 29,431 మంది సంవత్సరం నుంచి 3 సంవత్సరాల్లోపు చిన్నారులు, 22,203 మం ది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులున్నారు.

సగానికిపైగా కేంద్రాలకు సొంత భవనాలు కరువు....

జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో గల అంగన్‌ వాడీ కేంద్రాల్లో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు జిల్లాలో 1,065 కేంద్రాలుండగా 241 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నా యి. 591 కేంద్రాలు అద్దె గదుల్లో పనిచేస్తున్నాయి. 233 కేంద్రాలు ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ధర్మపురి ప్రాజె క్టు పరిధిలో 222 కేంద్రాలకు గానూ 63 కేంద్రాలు సొంత భవనాల్లో ప నిచేస్తుండగా 107 కేంద్రాలు అద్దె భవనాల్లో, 52 కేంద్రాలు ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలో 304 కేంద్రాలకు గాను 64 కేంద్రాలు సొంత భవనాల్లో పనిచేస్తుండగా 180 కేంద్రాలు అద్దె భవనాల్లో, 60 కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. మల్యాల ప్రాజెక్టు పరిధిలో 227 కేంద్రాలకు గాను 67 కేంద్రాలు సొంత భవనాల్లో పనిచేస్తుండగా 126 కేంద్రాలు అద్దె భవనా ల్లో, 34 కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నాయి. మె ట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో 312 కేంద్రాలకు గాను 47 కేంద్రాలు సొంత భవనాల్లో పనిచేస్తుండగా 178 కేంద్రాలు అద్దె భవనాల్లో, 87 కేంద్రాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్నాయి.

టీచర్లు, ఆయాలకు తప్పని తిప్పలు....

సొంత భవనాలు లేకపోవడం వల్ల విధులను సక్రమంగా నిర్వహించడంలో టీచర్లు, ఆయాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వర కు అంగన్‌వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నా విధులు మా త్రం అనేకంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఆరు నెలల నుంచి ఆరు ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులకు పౌష్టికాహారం అందజేయడం, మూ డు నుంచి ఆరు ఏళ్ల బాలబాలికలను పాఠశాల వైపు ఆకర్శిస్తూ విద్యపై అవగాహన కల్పించడం, చిన్నారులకు రోగ నిరోదక టీకాలు ఇప్పించ డం, ఆరోగ్య పరీక్షలు, ఇతర వైద్య సేవలు అందించడం వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. వీటికితోడు మహిళల వివరాలు, గర్బిణులు, బా లింతల వివరాలు వారి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం వంటి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రాధాన్యంపై మహిళలు, కిషోరబాలికలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. రక్త హీనత, విటమిన్‌ ఏ లోపం వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వి వరించాల్సి ఉంటుంది. ఇలా చిన్నారులు, మహిళలు, కిషోర బాలికల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యగా ఆయా కేంద్రాల కార్యకర్తలు తమ విధులను నిర్వహించాల్సి ఉంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాలకు సొంత భవనాలను సమకూర్చాల్సిన అవసరముందని మహిళా సంఘాల నాయకులు కోరుతున్నారు. 

సొంత భవనాల సమస్యను పరిష్కరిస్తాం

నరేశ్‌ కుమార్‌, జిల్లా శిశు సంక్షేమాధికారి, జగిత్యాల

జిల్లాలోని అంగన్‌ వాడీ కేంద్రాలకు సొంత భవనాలను సమకూర్చడా నికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎక్కెడెక్కడ అంగన్‌ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అవసరమున్నా యో వివరాలు సేకరించాము. పరిస్థితిని ప్రభుత్వానికి అందించాము. సొంత భవనాలు సమకూర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము.


Updated Date - 2021-10-10T05:23:06+05:30 IST