Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి వేడుకలో బంధువులందరి ముందే వరుడిని తిట్టేసిన వధువు.. దండను అతడి మెడలో ఎలా వేసిందో మీరే చూడండి..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వేడుకలో సాధారణంగా వధువు సిగ్గు పడుతూ ఉంటుంది కదా. కానీ ఓ వధువు మాత్రం వరుడిపై కన్నెర్ర జేసింది. బంధువులందరి ముందే అతడిని తిట్టేసింది. అంతేకాకుండా కోప్పడుతూనే పూలమాలను వరుడు మెడలో వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్ చేస్తున్నారు. కాగా.. పెళ్లి వేడుకలో ఆ వధువు ఎందుకు వరుడిని తిట్టింది. అతను ఏం చేశాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఒకప్పుడు వధువు పెళ్లి వేడుకల్లో సిగ్గు పడుతూ పెళ్లిపీటలపై కూర్చునేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. మనసుకుని నచ్చినవాడికి ఓకే చెబుతున్న అమ్మాయిలు.. సంతోషం‌గా పెళ్లి పీటలపై కూర్చుకుంటున్నారు. చిరునవ్వులు చిందిస్తూ మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వధువు‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో పెళ్లి కూతురు ఒకప్పటిలా సిగ్గు పడలేదు.. అలాగని చిరునవ్వులూ చిందించలేదు. వీటికి భిన్నంగా కన్నెర్ర జేసి, పెళ్లి కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బంధువులందరి మందే నోటికొచ్చినట్టు తిట్టేసింది. అయితే ఆ పెళ్లి కూతురుకు కోపం రావడానికి ఓ కారణం ఉంది. 


అదేంటి అంటే.. దండలు మార్చుకోవడానికి వధువు, వరుడు ఎదురెదురుగా నిల్చుంటారు. అనంతరం వరుడి మెడలో వధువు.. పూలమాల వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో వరుడి పక్కనే ఉన్న అతడి స్నేహితుడు కాస్త ఫన్ క్రియేట్ చేద్దాం అని భావించి.. సరిగ్గా వరుడు మెడలో వధువు పూలమాల వేస్తుండగా అతడిని కాస్తా పక్కకు లాగుతాడు. దీంతో అతడి మెడలో ఆమె పూల మాల వేయలేకపోతుంది. ఒకటికి రెండుసార్లు వరుడి స్నేహితుడు అలా చేయడంతో వధువు కన్నెర్ర చేస్తుంది. దీంతో బంధువుల ముందే వరుడిని తిడుతూ.. కోపంతో చిటపటలాడుతూనే ఎట్టకేలకు అతడి మెడలో పూలదండ వేస్తుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement