తెలుగును రక్షించుకుందాం...

ABN , First Publish Date - 2021-11-28T16:40:18+05:30 IST

రాష్ట్రంలో తెలుగు భాషను రక్షించుకోవాలని టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి మాజీ ఉపాధ్య క్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కె. అనిల్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జనని వ్యవస్థాపకుడు గుడి మెట్ల చెన్నయ్య

తెలుగును రక్షించుకుందాం...

                              - అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపు


చెన్నై: రాష్ట్రంలో తెలుగు భాషను రక్షించుకోవాలని టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహామండలి మాజీ ఉపాధ్య క్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కె. అనిల్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జనని వ్యవస్థాపకుడు గుడి మెట్ల చెన్నయ్య రచించిన ‘జీవన పోరాటం’ పుస్తకా విష్కరణ కార్యక్రమం తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక పెరంబూరులోని ఆర్‌బీసీసీసీ మహోన్నత పాఠశాల ఆడిటోరియంలో జరిగింది. సంఘం అధ్య క్షుడు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిల్‌కుమార్‌ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తూ.. గుడిమెట్ల చెన్నయ్య తెలుగు భాషపై ఎంతో మక్కువతో రచనలు చేస్తున్నారని, ఇందులో ఆయన ఆవేదన, ఆక్రోశం వెల్లడవుతోందన్నారు. తమిళనాట తెలుగు భాషపై ప్రేమాభిమానాలు తగ్గాయని, భవిష్యత్తు తరాలు తెలుగు మాట్లాడతారా అన్నది ప్రశ్నార్థక మైందన్నారు. కార్యక్రమంలో భాగంగా మద్రాస్‌ యూనివర్శిటీ తెలుగుశాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ.. తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తున్న చెన్నయ్య ప్రశంసనీయుడన్నారు. తమిళనాడు సాంస్కృతిక సంఘం కార్యదర్శి పీఆర్‌ కేశవులు మాట్లాడుతూ.. చెన్నయ్య తన కవితాఝరిని జీవన పోరాటంలో వినిపించారని, ఇందులో వ్యక్తిగత సమస్యలు, సమాజంలో ఒడిదుడుగులు, స్త్రీలకు జరిగే అవమానాలు చక్కగా సరళమైన భాషలో తెలియజేశారన్నారు. భారతి మహిళా కళాశాల తెలుగుశాఖ విశ్రాంత అధ్యక్షురాలు డాక్టర్‌ నిర్మలా పళనివేల్‌ పుస్తక సమీక్ష చేస్తూ.. కవిగా చెన్నయ్య గెలిచారని కొనియాడారు. చెన్నయ్య స్పందిస్తూ.. తనకు సాహిత్యంపై అవగాహన లేదని, తాను సాహితీపరుడిని కాకపోయినా తనకున్న ఆవేశాలు, ఆవేదనలకు అక్షరరూపమిచ్చానన్నారు. కాగా కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రముఖులు గుడిమెట్ల చెన్నయ్య దంపతులను ఘనంగా సత్కరించారు.

Updated Date - 2021-11-28T16:40:18+05:30 IST