అన్నమయ్య ప్రాజెక్టు నుంచి..చివరి ఆయకట్టుకు అందని నీరు

ABN , First Publish Date - 2020-05-28T10:38:42+05:30 IST

రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు చివరి ఆయకట్టు కు నీరందక పంటలు ఎండిపోతున్నాయి.

అన్నమయ్య ప్రాజెక్టు నుంచి..చివరి ఆయకట్టుకు అందని నీరు

ఎండిపోతున్న పంటలు 

ఆందోళనలో రైతన్నలు


రాజంపేట, మే27 : రాజంపేట ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు చివరి ఆయకట్టు కు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతమైన మిట్టమీదపల్లె, కొల్లావారిపల్లె, బావికాడపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లోని వివిధ గ్రామాల్లోని భూములకు అన్నమయ్య ప్రాజెక్టు నీరు అందడం లేదు. వరుసగా వర్షాలు లేకపోవడం... ప్రాజెక్టులో స్వల్పంగా నీరు ఉండటంతో చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందడం లేదు.


ఇటీవల చెయ్యేటి నుంచి గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు భూగర్భజలాల పెంపు కోసం కేవలం 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే విధంగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేసి ఉంటే ప్రస్తుతం సాగుచేసిన పంటలకు కాస్తోకూస్తో పండేవని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు స్పందించి రాజంపేట, పుల్లంపేట మండలాల్లోని అన్నమయ్య చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు వదలాలని ఆ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-05-28T10:38:42+05:30 IST