మరో రైల్వేస్టేషన్‌కు పేరు మార్పు... సీఎం గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2020-12-04T16:28:59+05:30 IST

యూపీలోని లక్నో- వారణాసి రైల్వే విభాగంలోని ప్రతాప్‌గఢ్... బాద్‌షాపూర్ మధ్య ఉన్న దాందూపూర్...

మరో రైల్వేస్టేషన్‌కు పేరు మార్పు... సీఎం గ్రీన్ సిగ్నల్!

లక్నో: యూపీలోని లక్నో- వారణాసి రైల్వే విభాగంలోని ప్రతాప్‌గఢ్... బాద్‌షాపూర్ మధ్య ఉన్న దాందూపూర్ రైల్వే స్టేషన్ పేరు ఇకపై ‘మా బారాహీ దేవీ ధామ్’గా మారనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆమోదంతో ఈ రైల్వే స్టేషన్ పేరు త్వరలోనే అధికారికంగా మారిపోనుంది.


ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. ప్రతాప్‌గఢ్ పరిధిలోని ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, స్థానిక ధర్మస్థలాల, ఆధ్యాత్మిక కేంద్రాలకు గుర్తింపు నిచ్చేందుకు ఈ రైల్వే స్టేషన్‌కు ‘మా బారాహీ దేవి ధామ్’ అనే పేరు పెట్టనున్నారు. దాందూపూర్ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు పాసింజర్ రైళ్లు కూడా ఆగుతుంటాయి. 


Updated Date - 2020-12-04T16:28:59+05:30 IST