మరో విద్యార్థి మృతదేహం వెలికితీత

ABN , First Publish Date - 2022-01-20T03:56:44+05:30 IST

మండలంలోని ఆల్గామ వద్ద ప్రాణహిత నదిలో గల్లంతైన మూడో విద్యార్థి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 17న ఈతకని వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు కాగా మంగళవారం రెండు శవాలు లభ్యమయ్యాయి. ఆచూకీ దొరకని గారె రాకేష్‌ (16) కోసం రెస్య్కూసిబ్బంది, గజ ఈతగాళ్లు పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మృతదేహం లభించింది.

మరో విద్యార్థి మృతదేహం వెలికితీత
మృతుల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌

20కిలోమీటర్ల దూరంలోని రంగయ్యపల్లి రేవు వద్ద లభ్యం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సుమన్‌

ఒక్కో కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం

కోటపల్లి, జనవరి 19 : మండలంలోని ఆల్గామ వద్ద ప్రాణహిత నదిలో గల్లంతైన మూడో విద్యార్థి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 17న ఈతకని వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు కాగా మంగళవారం రెండు శవాలు లభ్యమయ్యాయి. ఆచూకీ దొరకని గారె  రాకేష్‌ (16) కోసం రెస్య్కూసిబ్బంది, గజ ఈతగాళ్లు పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మృతదేహం లభించింది. కలెక్టర్‌ ఆదేశంతో కరీంనగర్‌ జిల్లా నుంచి స్పీడ్‌ బోటును తెప్పించి గాలించగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని అర్జునగుట్టకు ఇవతల మహారాష్ట్ర వైపు రంగయ్యపల్లె రేవు వద్ద గారె రాకేష్‌ శవం లభ్యమైంది. శవాన్ని పడవలో ఆల్గామ రేవు వరకు తీసుకువచ్చి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.  మూడు రోజులుగా నది వద్దే నిరీక్షిస్తున్న గారె రాకేష్‌ తల్లిదండ్రులు గారె రాజం-శాంతక్కలతోపాటు బంధువులు రోదనలు పలువుర్ని కలిచివేశాయి. ఘటన జరిగిన 48 గం టల తర్వాత మృతదేహం లభ్యమైంది. జైపూర్‌ ఏసీపీ నరేం దర్‌, చెన్నూరురూరల్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ నరేష్‌, మంచి ర్యాల ఆర్డీవో వేణు, తహసీల్దార్‌ గోవింద్‌నాయక్‌ పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలను ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. నది వద్ద నాయ కులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల తల్లిదండ్రులను పరామర్శించి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందిం చారు. సర్పంచు కుమ్మరి సంతోష్‌, లక్ష్మణ్‌గౌడ్‌, జెల్ల సతీష్‌, పున్నంచంద్‌, సత్యనారా యణరావు, ఎంపీటీసీలు తిరుపతి, జేక శేఖర్‌లతో పాటు టీఆర్‌ఎస్‌వీ నాయకులు విద్యాసాగర్‌, విష్ణు దాస్‌, ప్రవీణ్‌లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. 

మృతుల కుటుంబాలకు  ఎమ్మెల్యే సుమన్‌ పరామర్శ 

ప్రాణహిత నదిలో ఈతకని వెళ్లి గల్లంతై మృతిచెందిన  ఆల్గామకు చెందిన అంబాల వంశీవర్ధన్‌, అంబాల విజయేంద్ర సాయి, గారె రాకేష్‌ కుటుంబాలను బుధవారం రాత్రి ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి విద్యార్థుల చిత్రపటాలకు నివాళులర్పించారు.  అనంతరం తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. చిన్న వయస్సులోనే అకాల మరణం చెందడం కలిచివేసిందని   ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ సాంబగౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అస్గర్‌, సర్పంచులు సంతోష్‌, పున్నంచంద్‌, ఎంపీటీసీ తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు బైస ప్రభాకర్‌, యూత్‌ అధ్యక్షుడు విద్యాసాగర్‌, నాయకులు మంత్రి రామయ్య, గాదె శ్రీనివాస్‌, లాపాక రాజమొగిలి, ఆసంపల్లి సంపత్‌ ఉన్నారు. 

Updated Date - 2022-01-20T03:56:44+05:30 IST