సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-27T05:48:18+05:30 IST

సిద్దిపేటఅర్బన్‌, జనవరి 26 : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్షపార్టీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
హుస్నాబాద్‌లో ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

 అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో

బైక్‌ ర్యాలీలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు



సిద్దిపేటఅర్బన్‌, జనవరి 26 : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్షపార్టీ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో గణతం త్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేస్తున్న ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా మంగళవారం సిద్దిపేటలో అఖిలపక్షం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గాంధీచౌక్‌ నుంచి బీజేఆర్‌ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి మద్దతుగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, ఆర్‌ఎ్‌సపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. రెండు మాసాలుగా ఢిల్లీలో లక్షలాది  రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు. ర్యాలీలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు  బొమ్మల యాదగిరి, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు శంకర్‌, ఆర్‌ఎ్‌సపీ జిల్లా నాయకులు మన్నెకుమార్‌, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నక్కల యాదవరెడ్డి, సీపీఐ నాయకులు బన్సీలాల్‌, లక్ష్మణ్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మచ్చ శ్రీనివాస్‌, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ నాయకులు నాయిని నరసింహారెడ్డి, నాయకులువర్మ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్‌, అరవింద్‌, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ నాయకులు కలీమొద్దీన్‌, ఐద్వా నాయకులు హేమలత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌, ప్రజా సంఘాల నాయకులు నాగరాజు, రమేష్‌, కనకాచారి, సంజీవ్‌, విద్యానాథ్‌, విజయ్‌,  అశోక్‌, ఆటోయూనియన్‌ నాయకులు భాస్కర్‌,  రవీందర్‌రెడ్డి, నవీన్‌, పాల్గొన్నారు.

చేర్యాల: ఢిల్లీలో రైతులు చేపట్టిన మహార్యాలీకి మద్దతుగా చేర్యాలలో సీపీఎం ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడారు.  కార్యక్రమంలో నాయకులు దాసరి కళావతి, కొంగరి వెంకట్‌మావో, పోలోజు శ్రీహరి, రాళ్లబండి నాగరాజు, ముస్త్యాల ప్రభాకర్‌, మేడిపల్లి చందు, ఆముదాల నర్సిరెడ్డి, రాళ్లబండి భాస్కర్‌  పాల్గొన్నారు.

 మిరుదొడ్డి : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ జిల్లా కోఆర్టినేటర్‌ ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మిరుదొడ్డిలో నల్లబ్యాడ్జిలు ధరించి రైతులతో కలిసి తహసీల్దార్‌ సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రవీందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సాయిరెడ్డి ఉన్నారు. 

హుస్నాబాద్‌ : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా హుస్నాబాద్‌లో రైతు ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బస్‌డిపో గ్రౌండ్‌ నుంచి అనభేరి చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, వ్యవసాయ మార్కెట్‌ యార్డు వరకు వెళ్లి తిరిగి బస్‌డిపో గ్రౌండ్‌ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్‌ బొలిశెట్టి శివయ్య,రైతు ఐక్యతా సంఘంనాయకులు పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌, కిష్టస్వా మి, వెంకన్న, రవీందర్‌రెడ్డి, వరియోగుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, సరోజన, రాజు, పున్నసది, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.   

గజ్వేల్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమానికి గజ్వేల్‌ ప్రజాసంఘాలు పూర్తిస్థాయిలో మద్దుతునిస్తున్నాయని సీఐటీయూ, మాలమహానాడు, యూటీఎఫ్‌, రైతు సంఘం, యువజన సంఘం, ఎస్‌ఎ్‌ఫఐ, అంబేడ్కర్‌ సంఘం ప్రజా సంఘాల నాయకులు సందబోయిన ఎల్లయ్య, తుమ్మ శ్రీనివాస్‌, చిప్పల యాదగిరి, ఎండీ వలీ, నవీన్‌, బండ్లస్వామి, నర్సింలు తెలిపారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్ష ట్రాక్టర్ల పరేడ్‌కు మద్దతిస్తూ మంగళవారం గజ్వేల్‌ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలు అమలయితే రైతులకు ఉరితాడు తప్ప మరో మార్గం లేదని అన్నారు.  ప్రజలకు హాని చేసే చట్టాలను రద్దు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  ప్రజా సంఘాల నాయకులు రంగారెడ్డి, అరుణ్‌, కనకయ్య, కృపానందం, మోహన్‌రెడ్డి, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2021-01-27T05:48:18+05:30 IST