Abn logo
Jun 19 2021 @ 01:46AM

ఐరాస ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఆంటోనియో

ఐక్యరాజ్యసమితి, జూన్‌ 18: ఆంటోనియో గుటెరెస్‌ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంటోనియా ప్రధాన కార్యదర్శిగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2026 డిసెంబర్‌ 31 వరకు కొనసాగుతారని ఐరాస అధ్యక్షుడు వోల్కాన్‌ బొజ్కిర్‌ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో రెండోసారి ఎన్నిక కావడాన్ని స్వాగతిస్తూ ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎ్‌స.తిరుమూర్తి ట్వీట్‌ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గత నెలలో ఆంటోనియోను కలిసి భారత దేశం తరఫున మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

జాతీయంమరిన్ని...