అన్య మతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2020-09-21T11:49:34+05:30 IST

అన్య మతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

అన్య మతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబ రు 20: తిరుమల తిరుపతి దేవ స్థానంలోకి అన్య మతస్తులు ప్రవేశించాలంటే డిక్లరేషన్‌ తప్ప నిసరి అని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనే యులు అన్నారు. జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌ సుబ్బా రెడ్డి తిరుమల దేవస్థానంలోకి వెళ్లాలంటే అన్యమతస్తులకు డిక్లరేషన్‌ అక్కరలేదని చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేవదాయ ధర్మదాయశాఖ చట్ట ప్రకారం 311 ఆర్టి కల్‌ రూల్‌ నెంబరు16లో హిందూ దేవాలయాలకు వెళ్లే అన్యమతస్తులు తప్పని సరిగా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనన్నారు. టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనన్నా రు. జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, జిల్లా జనరల్‌ సెక్రటరీ ఉప్పాల జగదీశ్‌బాబు, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దాసరి ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నిరంజన్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-21T11:49:34+05:30 IST