Abn logo
Aug 27 2021 @ 11:06AM

AP ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.  ఒకేరోజు 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రకాశం జిల్లా వీరేపల్లి, వెదుల్లచెరువు పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అటు పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి, వట్లూరు జడ్పీ హైస్కూళ్లలో ముగ్గురు విద్యార్థులకు కరోనాగా నిర్ధారణ అయ్యింది. కృష్ణా జిల్లా శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో  కరోనా బాధితుల సంఖ్య 22కు చేరింది. కరోనా కేసులతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.