పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో మరో రెండు యూనిట్లు

ABN , First Publish Date - 2021-10-24T07:08:30+05:30 IST

సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు, నాలుగు యూనిట్లు మరొక 20రోజుల్లో వినియోగం లోకి వస్తాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఛీప్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు.

పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో మరో రెండు యూనిట్లు
పవర్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న ఢిల్లీ నిపుణుల బృందం

  • ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు

మోతూగూడెం, అక్టోబరు 23: సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు, నాలుగు యూనిట్లు మరొక 20రోజుల్లో వినియోగం లోకి వస్తాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఛీప్‌ ఇంజనీర్‌ రాంబాబు తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు నాలుగున్నర దశా బ్ధాలు పైబడినది కావడంతో యూనిట్లను ఆధునికీ కరించే చర్యల్లో భాగంగా మూడు, నాలుగు యూని ట్లకు లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ కోసం ఆరెల్‌ఈ అనే టెస్ట్‌లు నిర్వహించడంకోసం ఈ రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేశామన్నారు. మూడో యూ నిట్‌కు ఆర్‌ఎల్‌ఈ టెస్టులు ఇటీవల పూర్తయిన ప్పటికీ యూనిట్‌లో చిన్న సాంకేతిక లోపాలు తలెత్తు తున్న నేపథ్యంలో వాటిని సరి చేస్తున్నామన్నారు. పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్ధ్యంగల నాలుగు యూనిట్లలో ఒకటి, రెండో యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని నిర్వహిస్తున్నామన్నారు. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో మొదటి యూనిట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని, మరో నెలరోజుల్లో ఈ యూనిట్‌ వినియోగంలోకి వస్తుందని తెలిపారు. సీలేరు కాంప్లెక్సులో  పదిరోజులుగా రోజుకు 6 మిలియన్‌ యూనిట్ల వరకు ఉత్పత్తిని చేస్తున్నామని తెలిపారు. పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా మరో 230 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రతిపాదించిన మరో రెండు యూనిట్ల (5,6యూనిట్ల)కు సంబంధించి ఇంకా టెండర్‌ ప్రకియ్ర జరగలేదన్నారు. సీలేరు కాంప్లెక్స్‌లో 1950 మెగావాట్ల సామర్ధ్యంతో ప్రతిపాదించిన పంపింగ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుపై ఏపీ జెన్‌కో ఉన్నతాధికార్లు, రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందని తెలిపారు.

Updated Date - 2021-10-24T07:08:30+05:30 IST