11న ABNకు ఆరాధన శ్రీకరి పురస్కారం..

ABN , First Publish Date - 2021-12-08T13:52:27+05:30 IST

ప్రముఖ న్యూస్‌ చానల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అవుతున్న

11న ABNకు ఆరాధన శ్రీకరి పురస్కారం..

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ప్రముఖ న్యూస్‌ చానల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అవుతున్న ఏబీఎన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ కార్యక్రమాన్ని ఉత్తమ కార్యక్రమంగా ఎంపిక చేసి ఆరాధన -శ్రీకరి టీవీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ఆరాధన సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు. ఈనెల 11న సాయం త్రం త్యాగరాయగానసభలో జరిగే కార్యక్రమంలో ఏబీఎన్‌- స్పెషల్‌ ఎడిషన్‌ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న ప్రొడ్యూసర్‌ నరసింహారావుకు ఈ పురస్కారాన్ని అందజేస్తామని వివరించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా పాల్గొ ని పురస్కారాన్ని బహూకరిస్తారన్నారు. 

Updated Date - 2021-12-08T13:52:27+05:30 IST